చెరువులో దూకి వివాహిత ఆత్మ హత్య

- Advertisement -

చెరువులో దూకి వివాహిత ఆత్మ హత్య
అన్నమయ్య జిల్లా

కుటుంబ కలహాలతో చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన కురబలకోట మండలంలో బుధవారం వెలుగుచూసింది… ముదివేడు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఆదినారాయణ కథనం మేరకు..  తెట్టు హరిజనవాడకు చెందిన మేకల ప్రసాద్ భార్య మేకల సుజాత( 38) విశ్వం కళాశాలలో పనిచేస్తోంది. ఈ నెల 19న కళాశాలకు వచ్చిన ఆమె సాయంత్రం ఇంటికి రాక పోవడంతో కుటుంబికులు చుట్టుపక్కల విచారించి జనవరి 21న ముదివేడు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఆదినారాయణ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా బుధవారం అంగళ్ళు అక్కమ్మ చెరువులో సుజాత శవమై తేలింది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular