- Advertisement -
జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు…
కామారెడ్డి జిల్లా బ్యూరో జనవరి 24 వాయిస్ టుడే:
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో బుధవారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులకు కామారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎ ఎం వి ఐ
విక్రమ్ మాట్లాడుతూ రహదారి భద్రత జీవన రక్ష అని ప్రతి విద్యార్థి రోడ్డు ప్రయాణాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రాంగ్ రూటు ప్రయాణం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ,త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సంబంధిత వాహన పత్రాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గణేష్, ప్రిన్సిపల్ అనిల్ సిబ్బంది విద్యార్థిలు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




