భార్యాభర్తల బలవన్మరణం
అదిలాబాద్
నవవధువులైన భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి కు చెందిన చోపాడే విజయ్ కి ఇటీవల పల్లవి తో 8 నెలల క్రితం వివహమైనది. అయితే శుక్రవారం భార్య పల్లవి పురుగుల మందు తాగి ఆత్మహత్య కు యత్నించిగా, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె రాత్రి మృతి చెందింది. అనంతరం భర్త విజయ్ సైతం ఆదిలాబాద్ పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నవవధువులు ఇద్దరు ఆత్మహత్య కు పాల్పడడం విషాదం నెలకొంది. భార్యాభర్తల బలవన్మరణాలకు కుటుంబ కలహాలు కారణం కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు..ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .
భార్యాభర్తల బలవన్మరణం
- Advertisement -
- Advertisement -