Thursday, December 26, 2024

భారత్ తో పాటు తెలంగాణ వికాసానికి కేంద్రం కృషి చేస్తున్నది

- Advertisement -

భారత్ తో పాటు తెలంగాణ వికాసానికి కేంద్రం కృషి చేస్తున్నది

వికసిత భారత్ కార్యక్రమంలో అధికారుల వెల్లడి

నెక్కొండ
భారతదేశ అభివృద్ధి తో పాటు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో భారత్ తో పాటు  కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని ఆయా పథకాలకు సంబంధించిన శాఖల అధికారులు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పనికర గ్రామంలో మంగళవారం వికసిత భారత్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పింగిలి విజయ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్ఈడి స్క్రీన్ పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు పథకాలను దృశ్య రూపంగా  ప్రజలకు చూపించారు. అనంతరం ప్రజలకు ఒక్కో శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు పథకాలు దానివల్ల ప్రజలకు  ఉపయోగం ఎంతమందికి ఉపయోగపడుతుంది వివరించారు.11.52 లక్షల ఉత్సవాల గ్యాస్ కలెక్షన్లు పేద మహిళలకు పొగ నుండి విముక్తి కల్పించారని గ్యాస్  ప్రతినిధి కుంట మధు తెలిపారు. సొంతింటి కల సహకారంకై 2.33 లక్షలకు పైగా గృహాలు మంజూరు చేశారని, అలాగే శుద్ధమైన సురక్షితమైన తాగునీటి సదుపాయంకై 54 లక్షల కుళాయి కనెక్షన్లు ప్రజలు కల్పించిన ప్రభుత్వం, అణగారిన వర్గాలకు సామాజిక భద్రతకై పీఎం జన్ ధన్ యోజన కింద 1.13 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించారని, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన కింద 60 లక్షల పాలసీలు నమోదు చేసుకుని అటల్ పెన్షన్ యోజన కింద 19 లక్షల మందికి చందాలు ఇవ్వడమైందని అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 19 లక్షలమంది చంద్రధారులుగా నమోదయినారని వీటితోపాటు అటల్ పెన్షన్ యోజన పథకం కింద 1900000 మంది చందాదారులుగా నవోదయనారని వీటితోపాటు పిఎం స్వామి ది యోజన పథకం కింద 3.75 లక్షల మంది లబ్ధిదారులకు నిర్వహణ మూలధనం కింద 881 కోట్లు  సౌకర్యం కల్పించారని,తో ప్రపంచంలోని అతి పెద్ద పథకం ఆయుష్మాన్ భారత్ పీఎం ఆరోగ్య యువజన ఏటా కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య భీమా ఈ పథకం కింద 75.77 లక్షల పైగా ఆయుష్మాన్ కార్డులు భారత ప్రభుత్వం విడుదల చేసిందని, 5,213 ఆరోగ్య శ్రేయో కేంద్రాలు ప్రారంభించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుతున్నాయని, పేద ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలు నాణ్యమైన ఔషధాలు మందులు లభ్యత కోసం రాష్ట్రంలో 186 ఔషధ దుకాణాలు పనిచేస్తున్నాయని ఇంచార్జ్ మెడికల్ అధికారిణి డాక్టర్ రమ్య తెలిపారు.
దీంతోపాటు పీఎం ముద్ర యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన సుకన్య సమృద్ధి యోజన పలు పథకాలు ప్రవేశపెట్టిందని రైతన్నల సంక్షేమాని కోసం పీఎం కిసాన్ దేశంలోని తొలిసారిగా రైతన్నల ఖాతాలో 6000 ప్రత్యక్ష ఆదాయం మద్దతు సహాయం అందిస్తున్నదని,38.34 లక్షల మంది రైతులకు యెట 9.545 కోట్ల మీద యావత్ భారతదేశం లో రైతన్నలకు అందిస్తున్నారని అలాగే 5,967 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారని, దీంతోపాటు ఆహార భద్రతకు భరోసా పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యువజన కింద ఉచితంగా ఒక వ్యక్తికి ఐదు కేజీల బియ్యం అందిస్తున్నారని దీని ద్వారా, 35.21 లక్షల టన్నులకు పైగా హారదాన్యం పంపిణీ చేస్తుందని ఏప్రిల్ 2020 నుండి అక్టోబర్ 2023 వరకు ఈ విధానం కొనసాగిస్తూ మళ్లీ కొనసా మరో సంవత్సరం పొడిగించాలని భక్తులు తెలిపారు. స్వదేశీ దర్శన్ పథకం కింద తెలంగాణలో ఇతివృత్తి ఆధారిత పర్యటక సర్క్యూట్ల అభివృద్ధికి  268.39 కోట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిందని, ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో పర్యటక సర్కిల్ అభివృద్ధికి గాను 91.62 కోట్లు మంజూరు చేశారని, అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లా ములుగు లక్నవరం మేడారం తాడ్వాయి దామరవి మల్లూరు గోగత జలపాతాల గిరిజన అభివృద్ధిగా ఏర్పాటు చేసి 79.87 కోట్లు మంజూరు చేసిందని, అలంపూర్ జోగులాంబ ప్రాజెక్టుపై 36.73 కోట్ల మంజూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద తీర్థయాత్ర మౌలిక సదుపాయాల కల్పన కోసం 41.38 కోట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసిందని, తెలంగాణలో 2500 కిలోమీటర్లకు పైగా పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం చేశారని తెలంగాణ వ్యాప్తంగా ప్రాంతీయ అనుసంధానంలో, తెలంగాణ ప్రజలకు అత్యధిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాల కల్పనకై బీబీనగర్లో ఏఎంసీ నిర్మాణం కాజీపేటలో 500 కోట్ల విలువైన రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుతో రోజువారి ప్రయాణికులకు చిక్కులేని ప్రయాణ సదుపాయంకై నగర రోడ్ల రద్దీన్ తగ్గించాలని కోసం మెట్రో ఏర్పాటల్లో కేంద్ర ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తున్నదని, ప్రజలకు వక్తలు నెక్కొండ ఎస్బిఐ మేనేజర్ మహేష్ మెహతా, ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత, చెరుకు కళ్యాణ్ ,తదితరులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయా శాఖల అధికారులు ప్రజలకు వివరించారు. డ్రోన్ల సహకారంతో రైతులు వారి పంట పొలాల్లో క్రిమిసంహాక మందులు ఎలా పిచికారి చేయాలో డెమో క్లాసులు తొ వినియోగం రైతులకు వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్