13 ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
నిర్మల్ జిల్లా వాయిస్ టుడే ప్రతినిధి జనవరి 30
అక్రమంగా నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం కాల్వ గ్రామంలో నిలువ చేసుకున్న 13 ఇసుక డంపులను సోమవారం జిల్లా మైనింగ్ అధికారి క్రాంతికుమార్ దిలావర్పూర్ మండల్ ఆర్ ఐ సంతోష్ కాల్వ గ్రామములో గల అక్రమంగా నిల్యాచేసిన చేసిన ఇసుక 13 డాంపులను స్వాధీనపర్చు కోవడం జరిగినది.
ఈ యొక్క ఇసుక విలువ దాదాపు 2 లక్షల75 వేల వరకు ఉంటుందని మైనింగ్ అధికారులు తెలిపారు
తదుపరి చర్య తీసుకునే వరకు ఇట్టి ఇసుక డాంపులను గ్రామ పంచాయతీ కార్యదర్శికి అప్పగించడం జరిగినది. ఇదే క్రమంలో ఒక్క ఇసుక ట్రాక్టర్ ను శ్యాధీనం చేసుకుని తాగు చర్యల నిమిత్తం దిల్వార్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించి ఎస్సై అధీనంలో ఉచ్చడం జరిగినది. అదేవిధంగా స్వాధీన పరచుకున్న 13 ఇసుక డంపులను తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఎమ్మార్వో ఎస్సై అధికారులు తెలిపారు



