జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల
మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.గురువారం స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో లో పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న
ఐసిజెఎస్, టిఎస్ సిఓపి, సిసిటిఎన్ఎస్
లకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితులను అరెస్టు చేసేటప్పుడు ఇంటరాగేషన్ రిపోర్ట్ నందు నిందితుల యొక్క పూర్తి వివరాలు సేకరించి సిసిటిఎన్ఎస్ ప్రాజెక్ట్ లో ఎంట్రీ చేయాలని ఎంట్రీ చేసేటప్పుడు నిందితుల యొక్క క్వాలిటీ డాటా ఎంట్రీ చేయాలని అన్నారు. ఈ డాటా బేస్ ద్వారా ఎన్నో కేసులు చేదించవచ్చని తెలిపారు. రాబోవు తరాల వారికి డాటా ఎంతో ముఖ్యమని ఏ చిన్న తప్పిదం లేకుండా డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. ప్రస్తుతం పోలీసు శాఖ లో సాంకేతిక వ్యవస్థ కీలక భాగంగా ఉందని, ఎప్పటికపుడు వివరాలు ఆన్లైన్ లో సరైన విధంగా నమోదు చేస్తూ మరింత పటిష్టమైన వ్యవస్థ రూపొందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి, వృత్తి నైపుణ్యం లో రోజువారీ పురోగతి సాధించాలని అన్నారు..
ఆనంతరం ఐసిజెఎస్, టిఎస్ సిఓపి, సిసిటిఎన్ఎస్ అప్లికేషన్ల పనితీరుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటీ కోర్ సిబ్బంది అధికారులకు వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర రావు,
డీఎస్పీలు రవీంధ్ర కుమార్,రవీంద్ర రెడ్డి,
సి.ఐ.ఎస్.ఐ లు, డీసీఆర్భీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.