జగిత్యాలలో “గావ్ చలో బస్తీ చలో” కార్యక్రమం

- Advertisement -

పదేళ్లలో ఉహాకందని అభివృద్ధి సాధించాం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి

జగిత్యాలలో “గావ్ చలో బస్తీ చలో” కార్యక్రమం

జగిత్యాల,
బీజేపీ నేతృత్వంలోని ప్రధాని మోడీ నాయకత్వంలో గత పదేళ్లలో దేశం ఉహాకందని అభివృద్ధి సాధించిందని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు.
“గావ్ చలో బస్తీ చలో” అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణ ప్రవాసి ఈ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా  జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్. బోగ శ్రావణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బోగ శ్రావణి మాట్లాడుతూ….
“గావ్ చలో బస్తీ చలో” అభ్యన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రవాసి కార్యకర్తలు ప్రతి వార్డ్ లో ప్రతి వీధికి వెళ్లాల్సి ఉంటుందన్నారు.
వార్డ్ స్థితిగతులను పరిశీలించి అ వార్డ్ లో బూత్ కమిటీలను అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నేతలను, కవులు, కళాకారులు, క్రీడాకారులను కలిసి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి , సంక్షేమ పథకాల గురించి వివరించి ఆ వార్డ్ లోని సమస్యల గురించి చర్చలు జరపాలని కార్యకర్తలకుశ్రావణి సూచించారు.
బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోవు లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగొట్టి యావత్ దేశ ప్రజలను విశ్వాసాన్ని చురగొనాలని శ్రావణి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, సిరికొండ రాజన్న,రంగు గోపాల్, కన్వీనర్ గాదాసు రాజేందర్, కో కన్వీనర్  బడే శంకరన్న, పవన్ సింగ్, బైరి రాజేందర్, మామిడాల రాజగోపాల్, మర్రిపల్లి సాగర్ మమత, లక్ష్మి, పుష్ప, మధురిమ బూత్ అధ్యక్షులు , బిజెపి నాయకులు, కార్యకర్తలు, పట్టణ పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular