అద్వానీకి భారతరత్నపట్ల విపక్షాల అభినందనల వెల్లువ
న్యూ డిల్లీ ఫిబ్రవరి 3
మాజీ ఉప ప్రధాని, రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయితే.. బీజేపీ ఇప్పటికీ నిలబడి ఉందంటే అందుకు కారణం అద్వానీనేనని, కానీ ఆ వాస్తవాన్ని చాలా ఆలస్యంగా గుర్తించారని దిల్లీకి చెందిన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తెలిపారు. ప్రతిపక్షాలలో, శివసేన (ఉద్ధవ్ వర్గం) సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. బాలాసాహెబ్ ఠాక్రే, సావర్కర్‌లకు ఇంకా భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి ఈ అవార్డులు గుర్తుకు వస్తాయని ఉద్ధవ్ వర్గం నేత ఆనంద్ దుబే అన్నారు.
అద్వానీకి భారతరత్నపట్ల విపక్షాల అభినందనల వెల్లువ
- Advertisement -
- Advertisement -