- Advertisement -

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని అన్మాస్ కుంటలో నీటి పారుదల, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి సర్వే..
కుంటని ఆనుకొని ఉన్న బహుళ అంతస్తు బిల్డింగ్ కాపౌండ్ వాల్ బఫర్ జోన్ ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమ ప్రహరీ నిర్మాణం గుర్తింపు..
సుమారు 10 కోట్ల విలువ చేసే భూమి గా అంచన…
ఫోటో రైటప్ 05: మేడిపల్లి 03: బఫర్ జోన్ ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమ ప్రహరీ నిర్మాణం గుర్తించిన అధికారులు.
(వాయిస్ టుడే న్యూస్) ఫిబ్రవరి 05 మేడిపల్లి :
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని అన్మాస్ కుంటలో నీటి పారుదల, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి సర్వే నిర్వహించగ కుంట ని ఆనుకొని ఉన్న బహుళ అంతస్తు బిల్డింగ్ కాపౌండ్ వాల్ బఫర్ జోన్ లోకి రావడం కనుగొన్నరు. దీని విలువ సుమారు 10 కోట్లు ఉంటుందని, ఈ విషయమై కమిషనర్ ని కూడా కలిసి వివరించగా సదరు ప్రాంగణం బఫర్ జోన్ కి వస్తే నిర్మాణాన్ని తొలగిస్తామని చెప్పారని, బఫర్ జోన్ ఎఫ్ టీ ఎల్ పరిధి లో గల అక్రమాలు ఎక్కడ జరిగిన ఉపేక్షించేది లేదు అని ముదిరాజ్, మత్స్యకారా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇలాంటి ప్రభుత్వ స్థలాలు అక్రమాలకు గురి అవుతూనే ఉన్నాయని, అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని వారు కోరుతున్నారు.
- Advertisement -



