ఘనంగా రమాబాయ్ జయంతి వేడుకలు
కమాన్ పూర్
మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రమాబాయ్ 128వ జయంతి వేడుకలను బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమే చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రమాబాయ్ జీవితం స్ఫూర్తి దాయకమనికొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు అంబటి కనకయ్య, జిల్లా నాయకులు దాసరి రామస్వామి, నాయకులు భూపెల్లి మల్లేష్, దాసరి రాంచంద్రం, గిల్లి లింగయ్య, చిప్పకుర్తి సత్యనారాయణ, కొంతం శ్రీనివాస్, రాణావేన లక్ష్మీనారాయణ, జంగపెల్లి లక్ష్మణ్, చిప్పకుర్తి శ్రీనివాస్, ఇనంగంటి మురళి మనోహర్ రావు, చంద్రయ్య, రమేష్, పోచం, సాగి శ్రీనివాస్ రావు, రాజిరెడ్డి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.