
కామారెడ్డి జిల్లా బ్యూరో వాయిస్ టుడే;
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్యే కాకముందు మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి కౌన్సిలర్లతో ధర్నా చేపట్టినప్పటికీ స్పందించకపోవడం, కౌన్సిలర్లతో కలిసి కమిషనర్ కలిసి వినతి పత్రం అందించిన పట్టించుకోకపోవడం సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించి ఇచ్చిన స్పందించకపోవడంతో అప్పుడే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి విజిలెన్స్ ఇతర శాఖలకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే గెలిచాక మున్సిపల్ అక్రమాలలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అధికారులు ముందుగా మున్సిపల్ కార్యానికి వచ్చి సంబంధిత శాఖల అధికారులను రికార్డులను తీసుకొని పంచనామా కు వెళ్లారు. ఇదే విషయమై కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ను మా ప్రతినిధి వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు ఇస్తూ సమాధానం దాటవేయడానికి ప్రయత్నించారు



