Thursday, March 19, 2026

పొమ్మనలేక పొగపెడుతున్నారు’..

- Advertisement -

పొమ్మనలేక పొగపెడుతున్నారు’..

బీజేపీకి బాబుమోహన్ రాజీనామా

బీజేపీకి మాజీ మంత్రి బాబుమోహన్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను వాడుకుని బీజేపీ పొమ్మనలేక పొగ పెడ్తోందని ఆరోపణలు చేశారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బాబుమోహన్ పోటీ చేశారు.

అందుకే రాజీనామా..

తాజాగా బాబుమోహన్.. వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశించారు. అయితే వరంగల్ టికెట్ బాబుమోహన్‌కు ఇచ్చేందుకు కమలంపార్టీ నిరాకరించింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీకి బాబు మోహన్ గుడ్‌బై చెప్పేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ టికెట్‌ను బాబుమోహన్ కుమారుడు ఉదయ్ మోహన్‌కు ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే తమ కుటుంబంలో బీజేపీ చిచ్చు పెడుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. దీంతో బీజేపీ చివరి నిమిషంలో ఆందోల్ టికెట్‌కు బాబూమోహన్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్