Monday, February 23, 2026

విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలి

- Advertisement -

ప్రత్యేక హోదా సహా ఇతర హామీలు అమలు చేయాలి

విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలి

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ తో ఏపీ సీఎం జగన్ మోహన్  రెడ్డి భేటీ

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్

పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ

దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం

అనంతరం నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం జగన్

అమరావతి
ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.

ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ తో చర్చించినట్టు

తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది.  ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి

నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు.

పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు

తొలి విడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని

ముఖ్యమంత్రి కోరారు. అయితే  పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని

వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల

బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని సీఎం కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు. రాష్ట్ర ఆర్థిక

పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పాడతాయన్న సీఎం రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌

కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి

తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను

కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల  రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని, విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ

పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని  సీఎం కోరారు.
కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్‌ కొత్త రైల్వేలైన్‌ను

దీంట్లో భాగంగా చేపట్టాలని కోరిన సీఎం. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు. విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని

ప్రధానిని  ముఖ్యమంత్రి కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్