నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేద్దాం
కొండగట్టు వద్ద బండి సంజయ్
కరీంనగర్
ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నామని బీజేపీ ఎంపి బండి సంజయ్ అన్నారు. శనివారం అయన కొండగట్టు ఆలయంలో పూజలు జరిపారు. సంజయ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో యాత్ర చేస్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో యాత్ర కొనసాగిస్తాం. ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం. ప్రజాహిత యాత్ర లక్ష్యం ప్రధాని మోదీ ని మూడోసారి ప్రధాని చేయడం. దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహానుభావుడు ప్రధాని నరేంద్ర మోదని అన్నారు. ఎంపిగా కరీంనగర్ పార్లమెంట్ కు ఏం చేశానో తెలియజేయడమే యాత్ర ఉద్దేశ్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కోసం నయా పైసా ఇవ్వలేదు. దేవుడ్ని నమ్ముకున్న ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భారత్ మాతను విశ్వ గురు స్థానంలో నిలిపిన నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయాల్సిన అవశ్యకత దేశ ప్రజలపై ఉందని అన్నారు.
నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేద్దాం
- Advertisement -
- Advertisement -