చావులోనూ వీడని స్నేహం

- Advertisement -

చావులోనూ వీడని స్నేహం

 

ఆసిఫాబాద్ జిల్లా: ప్రతినిధి

 

ఆసిఫాబాద్ జిల్లా: ఫిబ్రవరి12
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో బావిలో ఇద్దరు స్నేహితులు పడి మృత్యు వాత పడ్డారు.

తుమిడే హరీశ్(22), కంబాల మహేష్(22) ఇద్దరు స్నేహితులు. ఆదివారం సాయంత్రం ఒక పెండ్లికి వెళ్లిన వారిద్దరూ చేను వద్దకు వెళ్లారు.

బైక్ కొద్ది దూరంలో పార్క్ చేసి బావి వద్దకు వెళ్లారు. అక్కడ చీకటిగా ఉండటం తో ప్రమాదవ శాత్తూ జారి పడ్డారా…? లేక ఈతకు వెళ్లి చనిపోయారా..? అనేది తెలియాల్సి ఉంది.

బావి సమీపంలో మద్యం బాటిళ్లు ఉన్నాయి. సోమవారం ఉద‌యం బావిలో రెండు శ‌వాలు తేల‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular