తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి తో నీలం మధు ముదిరాజ్ భేటీ..
కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించి పూలబుకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. నీలం మధు చేరికను రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా సైనికునిగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ కి బహుమానంగా ఇస్తామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి ,మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,రోహిన్ రెడ్డి రఘువీర్ , తదితరులు పాల్గొన్నారు.




