రవాణాశాఖలో భారీ ఎత్తున బదిలీలు

- Advertisement -

రవాణాశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఏడు జిల్లాలకు చెందిన ఉప రవాణా కమిషనర్లు (డీటీసీలు) బదిలీ అయ్యారు. వీరితో పాటు 23 మంది ఆర్టీఓలు, 150 మంది ఎంవీఐలు, ఏఎంవీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా బదిలీ అయిన అధికారులకు విడివిడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరహాలో విడివిడి ఉత్తర్వులివ్వడం ఇదే తొలిసారి అని రవాణాశాఖ వర్గాల సమాచారం. ఆదిలాబాద్‌ డీటీసీ శ్రీనివాస్‌ను హనుమకొండకు, కరీంనగర్‌ డీటీసీ చంద్రశేఖర్‌ను రంగారెడ్డి జిల్లాకు, హనుమకొండ డీటీసీ పురుషోత్తంను కరీంనగర్‌కు, రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్‌రావును హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని కమిషనర్‌ కార్యాలయానికి రవాణాశాఖ బదిలీ చేసింది. మరో ముగ్గురు డీటీసీలను మూడురోజుల క్రితమే బదిలీ చేసింది. వీరిలో మహబూబ్‌నగర్‌ డీటీసీ దుర్గాప్రమీల నిజామాబాద్‌కు, నిజామాబాద్‌ డీటీసీ వెంకటరమణ సంగారెడ్డికి, సంగారెడ్డి డీటీసీ శివలింగయ్య మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లో మొత్తం 29 మంది అధికారులు బదిలీ అవ్వగా వీరిలో ఐదుగురు ఆర్టీఓలు, 19 మంది ఎంవీఐలు, ఐదుగురు ఏఎంవీఐలు ఉన్నారు. కొందరికి కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌ దక్కగా, మరికొందరిని మారుమూల ప్రాంతాలకు పంపడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular