- Advertisement -
బల్దియా బడ్జెట్ సిద్ధమైంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.7,937 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. సోమవారం జరిగే పాలకమండలి దీనిపై చర్చించనుంది. ఆమోదం అనంతరం ప్రభుత్వానికి నివేదించనుంది. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక మొట్టమొదటి సమావేశం కానుండడంతో చర్చలపై ఆసక్తి నెలకొంది. 2023-24 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బల్దియా బడ్జెట్ రూ.6690 కోట్లు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1247 కోట్లు ఎక్కువ చూపారు. పేదల ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.500 కోట్లుగా ప్రతిపాదించారు.
- Advertisement -




