- Advertisement -
మార్కెట్ యార్డులలో శుక్రవారం నుంచి పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
కనీస మద్దతు ధర రూ. 6760 కంటే తక్కువ ధరకు విక్రయించ వద్దు
మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల విజ్ఞప్తి
హైదరాబాద్ ఫిబ్రవరి 22
పొద్దుతిరుగుడు కోతలు ఆరంభమైన దృష్ట్యా , మార్కెట్లో కనీస మద్దతు ధర రావడం లేదన్న విషయం గౌరవ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు దృష్టికి వెళ్లడంతో వెంటనే మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి ప్రారంభించి పొద్దుతిరుగుడు పండించే రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.కనీస మద్దతు ధర ( రూ. 6760) కంటే తక్కువ ధరకు తొందరపడి విక్రయించవద్దని రైతులకు మంత్రి సూచించారు.
- Advertisement -



