జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు..!
ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్
హైదరాబాద్ ఫిబ్రవరి 22
;అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ కోరారు.విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమని.. ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరమన్నారు.గత సంవత్సరం జనవరిలో సియాటెల్ నగరంలో కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తన కారు ఢీకొనడంతో జాహ్నవి మరణించింది. అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారి జరిగిన ప్రమాదం గురించి బాధపడకుండా.. వర్ణ వివక్షతో మాట్లాడుతున్న వీడియో వెలుగు చూసింది. దీంతో ఆ పోలీస్ అధికారి కావాలనే ఢీకొట్టి చంపారని.. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు..!
- Advertisement -
- Advertisement -



