టీఎస్పీఎస్సీ లో హరిజoటల్ విధానాన్ని తీసివేసి వర్టికల్ విధానాన్ని అమలు చేయాలి
నిరుద్యోగ మహిళలు విద్యార్థినిల డిమాండ్
హన్మకొండ: టిఎస్సీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో మహిళలకు హరి జంటల్ విద్యా విధానాన్ని తీసివేయాలని అంబేద్కర్ జంక్షన్ వద్ద విద్యార్థినిల నిరసన నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కోచింగ్ సెంటర్లలో వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ కోచింగ్ తీసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో హరి జంటల్ విధానాన్ని తీసుకురావడం వల్ల మహిళలకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు అన్నారు అదేవిధంగా గత పాలకులు చేసిన తప్పిదాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే నిరుద్యోగ మహిళలు సహించేది లేదని వారు హెచ్చరిక జారీ చేశారు మహిళలను దృష్టిలో పెట్టుకొని వర్తికల్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం హరిజంటల్ విధానాన్ని రద్దు చేయకుండా టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ మహిళలను ఐక్యం చేసి పోరాటాలు ఆందోళనలు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో మమత. అనూష .స్వాతి అనిత. వసంత. కవిత తదితరులు పాల్గొన్నారు




