రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు సిద్దం
స్పష్టం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూ డిల్లీ ఫిబ్రవరి 22
రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రం చెరకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన నేపథ్యంలో గురువారం ఆయన ఈ విధంగా స్పందించారు.దేశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడిందని చెప్పారు. చెరకు కొనుగోలు ధర పెంపుకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ చర్య వల్ల చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు. కాగా, తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో మోదీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు సిద్దం
- Advertisement -
- Advertisement -


