ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శించరాదు
అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం తక్షణమే అందించాలి
జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ బాషా
జగిత్యాల,
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ మాసాల వరకు సంబంధించిన త్రైమాసిక సమీక్ష లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం తక్షణమే అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు.
జిల్లాలోని బ్యాంకు రుణ లక్ష్యాలు డిసెంబర్ 31 నాటికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ శుక్రవారం సంబంధిత బ్యాంకు అధికారులు, సంబంధిత ఏజెన్సీ సంస్థలతో డిసిసి , డీఎల్ఆర్సి సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పట్ల బ్యాంకర్లు అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ యాష్మీన్ భాషా మాట్లాడుతూ
జిల్లాలో సెప్టెంబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో వ్యవసాయ రుణాలకు సంబంధించి 1400 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు 578 కోట్లు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు.
అలాగే వీధి వ్యాపారులకు సంబంధించి రెండవ విడతలో 5683 మందికి రుణాలు మంజూరు చేసామని తెలిపారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రుణాల కింద 330 కోట్లు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 192 మందికి మంజూరు చేశామని తెలిపారు.
పిఎంఎఫ్ఎంఈ కింద ఇప్పటికే 252 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఆశించినంత పురోగతి సాధించని బ్యాంకులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ అన్ని రకాల పథకాలు అమలయ్యేలా చూడాలని సంబంధిత శాఖలను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్వశక్తి సంఘాలకు 586 కోట్లు, పట్టణ ప్రాంత సంఘాలకు 54.57 కోట్లు అందించామని తెలిపారు.
సమావేశాలకు హాజరయ్యే సమయాలలో బ్యాంకర్లు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.
అడిషనల్ కలెక్టర్ దివాకర మాట్లాడుతూ సరైన వివరాలు లేకుండా బ్యాంకు అధికారులైనా, ప్రభుత్వ శాఖల అధికారులైనా సమీక్ష సమావేశానికి రావొద్దనిఅధికారులను మందలించారు.
జిల్లాలో ప్రైవేటు బ్యాంకులు కొన్ని స్కీం లలో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అదనపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ పొన్న వెంకటరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజినల్ డిప్యూటీ హెడ్ ఆర్బీఐ ఎల్. డి. ఓ. సాయితేజ రెడ్డి, నాబార్డ్ డిడిఎం మనోహర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ రాం ప్రసాద్, డిఆర్డీఓ సంపత్ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు సాయిబాబా , ఎఫ్ ఎల్ సీ. కోట మధు సూదన్ తో పాటు వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.