Thursday, December 12, 2024

న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

న్యాయ వ్యవస్థలోనీ సమస్యలను నూతన ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి… లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్*
హైదరాబాదులోని లాయర్స్ పురం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ సామాజిక చైతన్యత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే నర్రి స్వామి కుర్మ  మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సరైన న్యాయం చేకూర్చాలని లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు న్యాయ వ్యవస్థలోని ముఖ్యమైన సమస్యలు
1. P.P లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు క్యాడర్ లో నియమితులైన వారు మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావాలి. కానీ హైదరాబాదులోని గత 15 సంవత్సరాలుగా అనేకమంది పనిచేస్తున్నారు. అందులో చాలామంది ఆంధ్ర పౌరసత్వం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు దీని వలన తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు చాలా అన్యాయం జరుగుతుంది
2. కిరణ్ కుమార్ యొక్క ప్రభుత్వంలో గ్రామీణ న్యాయవాదులకు నోటరీ అప్లికేషన్ కు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు ఆ న్యాయవాదులకు గెజిటెడ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు చాలామంది గ్రామీణ న్యాయవాదులు నష్టపోతున్నారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి
3. కోర్టు కానిస్టేబుల్ గా లైసెన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నవారు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండటం వల్ల నూతనంగా ప్రాక్టీస్ చేసేటటువంటి న్యాయవాదులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది కేసుల విషయంలో కోర్టు కానిస్టేబుల్ లో జోక్యాన్ని తగ్గించి వారిని వెంటనే మూడు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలి
4. నూతన గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జూనియర్ న్యాయవాదులకు 5 గౌరవ వేతనం చెల్లించాలి
5. న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పడే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి స్టేట్ న్యాయ ప్రొటెక్షన్ ఆక్ట్ తీసుకురావాలి దాని వలన న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చు
6. నూతనంగా హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో నియమించే జిపిలు ఏజీపీలు స్టాండింగ్ కౌన్సిల్ మొదలైన పోస్టుల్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులకు సరైన ప్రాతినిథ్యం కల్పించాలి
పైన పేర్కొన్నటువంటి సమస్యలను వీలైనంత త్వరగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పరిష్కరించి తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవ్యవస్థలో ఉన్న న్యాయవాదులు అందరికీ న్యాయం చేకూర్చే విధంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నం తెలియజేశారు ఈ కార్యక్రమంలో లాయర్స్ పోరంపర సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్ , తెలంగాణ న్యాయవాదుల సమిత అధ్యక్షులు పద్మారావు ,బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ యాదవ్, లాయర్స్ ఫోరం కార్యదర్శి సుదర్శన్ నేత సత్యనారాయణ మల్లేష్ మహేష్ బాబు అనేకమంది న్యాయవాదులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్