గిట్టుబాటు ధర కల్పించాలంటూ మిర్చి రైతుల ఆందోళన

- Advertisement -

గిట్టుబాటు ధర కల్పించాలంటూ మిర్చి రైతుల ఆందోళన

ఖమ్మం జిల్లా:

ఖమ్మం జిల్లా:మార్చి 01
వ్యాపారులు మిర్చిధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జెండా పాట కంటే తక్కువ కు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.. దీనిపై రైతులు మార్కెట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

వెంటనే అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయినా రైతులు శాంతించకుండా గిట్టుబాటు ధర కల్పించా లని అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్‌ చేశారు.

మార్కెట్‌లో ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జెండా పాట ధర క్వింటాల్‌కు రూ.20,800గా ప్రకటించి.. కేవలం రూ.14 వేల నుంచి రూ.16 వేల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular