ఒకటో తేదీనే వేతనాలు,పెన్షన్ల చెల్లింపు ఓ చరిత్రనే
తెలంగాణ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
జగిత్యాల
::రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో వేతనాలు,పెన్షన్లు అందించడం ఓ చరిత్ర గా పేర్కొంటూ తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.సోమవారం సంఘం కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా స్థాయి లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ,కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ 2022-2023,2023-2024 లో మొత్తం 24 నెలల్లో మొట్ట మొదటిసారిగా ఈ నెల ఒకటో తేదీనే జీతాలు,పెన్షన్లు ఇచ్చారన్నారు.గతంలో కొన్ని నెలల్లో అయితే ఏకంగా 15 వ తేదీ వరకు కూడా అందలేదన్నారు.2022 జులై లో 14న,2023 డిసెంబర్లో 15 వ తేదీన చెల్లింపును గుర్తు చేశారు.ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ,మా టి.పి.సి.ఏ.రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్యలు ముఖ్యమంత్రి ,ఉపముఖ్యమంత్రిల దృష్టికి తేవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.అలాగే పెండింగులో ఉన్న డి.ఏ.లను విడుదల చేయాలని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలుఉద్యోగులకు,పెన్షనర్లకు,జర్నలిస్టులకు అందించాలని,వైద్య ఖర్చుల రియంబర్స్ మెంట్ బిల్లులు త్వరితగతిన మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,సహా అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,ఉపాధ్యక్షులు వి.ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు,కొయ్యడ సత్యనారాయణ,మహిళా కార్యదర్శి బోబ్బాటి కరుణ,జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,
నాయకులు మధుసూదన్ రావు, ఎం.డి.యాకూబ్,
నారాయణ,దేవేందర్ రావు, ప్రసాద్,నర్సయ్య,హానుమాండ్లు,పబ్బా శివానందం,రాజ్ మోహన్, కండ్లేగంగాదర్,దిండి గాల విట్ఠల్, కె.గంగారెడ్డి, కమల,గంగమ్మ,తదితరులు పాల్గొన్నారు.