పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ దోస్తీ
కేసిఆర్
హైదరాబాద్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం నాడు అయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మాట్టాడుతూ చాలా అంశంలో కలిసి పని చేశాం. రేపు ఎన్ని సీట్లు పోటీ చేయాలని అనేది నిర్ణయం తీసుకుంటాం. మాయావతి తో ఇంకా మాట్లాడలేదు. కేవలం ఆర్ యస్ ప్రవీణ్ మాత్రమే మాట్లాడారని అన్నారు.
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేసిఆర్ ను కలవటం ఆనందంగా ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ దోస్తీ
- Advertisement -
- Advertisement -



