- Advertisement -
మున్నూరు కాపు జిల్లా మహిళా కార్యదర్శిగా గంగం జలజ
జగిత్యాల
తెలంగాణ మున్నూరు కాపు సంఘం జగిత్యాల జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా జగిత్యాల పట్టణం కు చెందిన గంగం జలజ ను నియమిస్తూ రాష్ట్ర సెక్రటరీ జెనెరల్ హరి ఆశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమోరెడ్డి విజయ్ ఆజాద్ ఆదేశాల మేరకు మున్నూరు కాపు మహిళా సంఘ సేవలు పలు ఏళ్లుగా చేస్తున్న గుర్తింపు కు ఆమెను మహిళా దినోత్సవం రోజున ఈ పదవిలో నియమించినట్లు ఆ ఉత్తర్వుల్లో హరి ఆశోక్ కుమార్ పేర్కొన్నారు.జలజను నియామక సందర్భంగా జిల్లా మున్నూరు కాపు నేత పోతం శెట్టి సతీశ్ రాజ్, మున్నూరు కాపు మహిళా సంఘం అధ్యక్షురాలు పుప్పాల విజయ,సంయుక్త కార్యదర్శి బక్కశెట్టి లక్ష్మి,తదితరులు అభినందించారు.
- Advertisement -



