- Advertisement -
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పొత్తులపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. భాజపాతో పొత్తుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అమిత్‌షాను కలిశారు. దానికి కొనసాగింపుగా మరోసారి భేటీ అయ్యారు. పొత్తులపై శుక్రవారంలోగా స్పష్టత వస్తుందని తెదేపా, జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
- Advertisement -



