కాంగ్రెస్ నేత బండి రమేష్ పై విమర్శలా.?
— సతీష్ అరోరా నీ అక్రమలను వెలికితీస్తాం
— కూకట్ పల్లి బీఆర్ఎస్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరాకు బహిరంగ సవాల్
కూకట్ పల్లి : మార్చి 8(వాయిస్ టుడే)
తెలంగాణ ద్రోహి సతీష్ ఆరోరా ఉద్యమకారులను వేధిస్తూ స్థానిక ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని కోట్లకు రూపాయలు సంపాదించలేదా కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి సవాల్ విసిరారు. కూకట్ పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్ పేరుతో నియోజకవర్గంలోని కార్పొరేటర్లను డమ్మిగా చేసి అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. రెడ్డి సతీష్ అరోరా, కూకట్ పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండి రమేష్ గారి పై విమర్శలు చేసే అంత ఆయ్యావా అని ప్రశ్నించారు. కూకట్ పల్లి జోనల్ పరిధిలో అధికారులను బెదిరించి వేలాది మంది బిల్డర్లు/ బిల్డింగ్ నిర్మాణదారుల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసింది నిజం కాదని ప్రశ్నించారు. త్వరలోనే రెడ్డి సతీష్ అరోరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రక్తం తాగిన విధంగా అమాయకులను బెదిరించి పీల్చి పిప్పి చేశారని ఆరోపించారు. నీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే సతీష్ అరోరా నియోజకవర్గంలో చేసిన ఆగడాలు అక్రమాలపై చార్జీషీట్ విడుదల చేస్తామని, బాధ్యులైన అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని శేరి సతీష్ రెడ్డి ప్రకటించారు.



