భూ సేకరణ పనులు త్వరిత గతిన చేపట్టాలి

- Advertisement -

భూ సేకరణ పనులు త్వరిత గతిన చేపట్టాలి

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల
భూ సేకరణ పనులు త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. బుధవారం రోజున కేంద్ర  మంత్రిత్వ శాఖ  కార్యదర్శి  జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో జాతీయ రహదారి నెంబర్ 63, రాష్ట్ర రహదారి 563 నిర్మాణ పనులకు భూసేకరణ పనులు నిర్దిష్ట సమయానికి సేకరణ జరగాలని సంభందిత మండల అధికారులను ఆదేశించారు. గతంలో సేకరించవలసిన భూములతో పాటు కొత్తగా ప్రతిపాదించిన భూముల సేకరణ కూడా తొందరగా చేపట్టాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ మధుసూదన్, భూ కొలతల సహాయ సంచాలకులు వెంకట్ రెడ్డి, తహశీల్దార్లు, సంభందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular