ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
కమాన్ పూర్
ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు బుధవారం నిర్వహించారు.
ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి గ్రామం నుండి వయా అడవి శ్రీరాంపూర్ ఓడేడు వరకు 15 కిలోమీటర్ల రోడ్డు సి ఆర్ ఐ ఎఫ్ నిధులతోని మంజూరు చేసిన ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులుదుదిల్ల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలుపుతూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి నాగిని జగన్మోహన్రావు ముత్తారం మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెలరాజయ్య మాట్లాడుతూ
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రివర్యులుశ్రీధర్ బాబు మంతిని నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను మంజూరు చేపిస్తూ రాష్ట్రంలోనే మంథని నియోజక వర్గాన్ని ఉన్నత స్థానంలో ఉంచడానికి అభివృద్ధి చేస్తున్నందుకు మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడవి శ్రీరాంపూర్ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణిమండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజిద్ పాషా మాజీ సర్పంచ్ రామన్న సింగల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు తోటి రఫీ బుచ్చారావు చంద్రయ్య గౌడ్ లక్కం ప్రభాకర్ అల్లం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.