బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల.. తెలంగాణ నుంచి ఈ ఆరుగురికి ఛాన్స్
బీజేపీ (BJP) ఇప్పటికే ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాని (BJP First List) విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 195 మంది అభ్యర్థులతో కూడిన ఆ తొలి జాబితాలో తెలంగాణ నుంచి మొత్తం 9 మంది చోటు సంపాదించారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాని (BJP Second List) విడుదల చేసింది. ఇందులో ఆరుగురు తెలంగాణ అభ్యర్థులు స్థానం దక్కించుకున్నారు. డీకే అరుణ (DK Aruna) (మహబూబ్ నగర్), ఎం రఘునందన్ రావు (మెదక్), గోదామ్ నాగేష్ (ఆదిలాబాద్), గోమాసా శ్రీనివాస్ (పెద్దపల్లి), ప్రొ. అజ్మీరా సీతారామ్ నాయక్ (మహబూబాబాద్), సైదా రెడ్డి (నల్గొండ) తదితరులు రెండో జాబితాలో ఉన్నారు. అయితే.. ఖమ్మం, వరంగల్ స్థానాలకు బీజేపీ హైకమాండ్ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు.




