- Advertisement -
పేద విద్యార్థులకు షిర్డీసాయిభక్త ట్రస్ట్ చేయూత
అబ్దుల్లాపూర్‌మెట్/ఇబ్రహీంపట్నం, వాయిస్ టుడే(మార్చి 17): అంతర్జాతీయ షిర్డీసాయిభక్త ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ నామసప్తాహం జరుగుతున్న సందర్భంగా పెద్దఅంబర్‌పేట్ పరిధి శాంతినగర్, సంతోష్ నగర్ కాలనీలకు చెందిన 11 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా పలువురు లెప్రసీ బాధితులకు బీపీ, షుగర్ ఆపరేటర్లు, దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ ఎస్.లక్ష్మీనరసింహారావు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి, జనరల్ సెక్రటరీ సమంతకమణి, ట్రెజరర్ పవన్, స్లాప్ రాష్ట్ర అధ్యక్షుడు మనియాద రమేష్, ట్రస్ట్ సభ్యులు దాట్ల హన్మంతు, రాజు, సీతారామరాజు, సాంబశివరాజు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -