సీక్రెట్ గా సిద్ధర్ధ పెళ్లి
హైదరాబాద్, మార్చి 27
హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన పంజాబీ భామ, ఇండియన్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అయితే… ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఏడు అడుగులు వేశారు. కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. అంత రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకున్నారని చాలా మంది చెవులు కోరుకున్నారు. ఆ సీక్రెట్ మ్యారేజ్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు ఆ బాటలో లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి నడిచినట్లు తెలిసింది. వాళ్లిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. హిందీ సినిమాలతో పేరు, గుర్తింపు తెచ్చుకున్న అదితి రావు హైదరి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె ఒకరు. అదితి తల్లి విద్యా రావు హిందూస్థానీ క్లాసికల్ సింగర్. ఆమె వనపర్తిలో జన్మించారు. అక్కడ పెరిగారు. అందుకని, వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి దేవాలయంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నారని తెలిసింది.తమ వివాహం గురించి అటు సిద్ధార్థ్ గానీ, ఇటు అదితి రావు హైదరి గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే, మీడియాకు సైతం సమాచారం ఇవ్వలేదు. వివాహ సమయంలో మీడియాతో పాటు ఇంకెవరినీ దేవాలయంలోకి అనుమతించలేదని తెలిసింది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కనుక రహస్యంగా ఉంచాలని, తమ కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు మాత్రమే చెబితే చాలని అనుకున్నారేమో!?
‘మహా సముద్రం’లో ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ!సిద్ధార్థ్, అదితి రావు హైదరి కలిసి ‘మహా సముద్రం’లో నటించారు. ఆ సినిమా చేసేటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ల పాటు వాళ్ల ప్రేమ విషయం ఎవరికీ తెలియలేదు. కానీ, ఇద్దరూ జంటగా కెమెరా కంటికి చిక్కడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి అందరికీ తెలిసింది. కానీ, సిద్దార్థ్ మాత్రం తన నోటి నుంచి ఎప్పుడూ చెప్పలేదు. ఇటీవల ముంబైలో ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అదితితో పాటు కెమెరాకు ఫోజులు ఇవ్వకుండా వెళ్లిపోయారు.
సీక్రెట్ గా సిద్ధర్ధ పెళ్లి
- Advertisement -
- Advertisement -