సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి వేడుకలు

- Advertisement -

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి వేడుకలు

వాయిస్ టుడే ప్రతినిధి బోయినపల్లి ఏప్రిల్ 2

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 314వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్ తో పాటు పలువురు గౌడ సంఘ సభ్యులు సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం అశోక్ గౌడ్ మాట్లాడుతూ 16వ శతాబ్దం నాటి బాహుబలి విప్లవ యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. 400 ఏళ్లు దాటినా ఆయన పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడని అన్నారు.
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని పాపన్న ఆశయాలు కొనసాగిస్తూ గౌడ కులస్తులు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్ గౌడ్ ,కోశాధికారి మెరుపుల గంగాధర్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగుల సాంబయ్య గౌడ్, సంఘం నాయకులు నల్లగొండ వేణుగోపాల్ గౌడ్ చింతల కోటి శ్రీనివాస్ గౌడ్. నల్లగొండ శ్రీనివాస్ గౌడ్ అనిల్ కుమార్ గౌడ్, మెరుపుల అంజయ్య గౌడ్, జలంధర్ గౌడ్ బత్తిని హరీష్ గౌడ్, బత్తిని కమలాక ర్ గౌడ్, బత్తినిఅనిల్ గౌడ్, గోనెల రాజేశం గౌడ్ , పెరుమాండ్ల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular