*డబ్బుల్లేవు… రేపు రండి*..
*మండుటెండలో పెన్షన్ దారులను ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం*
మంగళగిరి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల పంపిణీ చేస్తున్న సామాజిక పెన్షన్లు పంపిణీ ఆలస్యంగా జరుగుతుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను పాల్గొనవద్దని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. బుధవారం ఉదయం నుండి పంపిణీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మంగళగిరి పట్టణంలోని ఎనిమిదవ సచివాలయానికి పెన్షన్‌దారులు వెళ్లారు. డబ్బులు లేవు.. రేపు ఉదయం 6 గంటలకు రమ్మని సచివాలయ అడ్మిన్ సమాధానం చెప్పడం జరిగింది. దీంతో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తూ వెనక్కి పోతున్నారు. టీవీలో, పేపర్లో ఈరోజు నుండి పంపిణీ చేస్తామని ఎందుకు చెప్పుకొచ్చారని ప్రశ్నించారు. పెన్షన్ దారులకు సచివాలయ సిబ్బంది సమాధానం చెప్పలేకపోయారు.




