ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాదిగ కులానికి చెందిన మేధావులు, విద్యార్థులు మండిపడుతున్నారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ సీట్ల కేటాయింపులో మాదిగలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
75 శాతం జనాభా ఉన్న మాదిగలకు రేవంత్ మొండి చేయి చూపుతున్నారని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అధిక శాతం ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించకపోవడంతో.. మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా.. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు నినాదాలు చేశారు.