Sunday, December 22, 2024

కారు… సారు… బేజారు

- Advertisement -

కారు… సారు… బేజారు
హైదరాబాద్, ఏప్రిల్ 5
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై పక్షం రోజులైంది. మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సుమారు పదేళ్లు అదికారంలో ఉన్న గులాబీ పార్టీ.. ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. జాతీయ పార్టీలకు దీటుగా గులాబీ బాస్‌ కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించినా.. ఎన్నికల నాటికి ఎవరు బరిలో ఉంటారో ఎవరు తప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు గులాబీ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. సిట్టింగ్‌ ఎంపీలు ముగ్గురు ఇప్పటికే పార్టీ మారగా, తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు అఫీషియల్‌గా పార్టీ వీడారు. మరికొందరు అధికార కాంగ్రెస్‌ పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలు గులాబీ పార్టీకి సవాల్‌గా మారాయి.2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సారు, కారు, కేంద్రంలో సర్కారు నినాదంతో ముందుకు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే లోక్‌సభ ఎన్నికలు జరిగినా.. ప్రజలు బీఆర్‌ఎస్‌ను విశ్వసించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ పార్టీని కేవలం 9 సీట్లకే పరిమితం చేశారు. అనూహ్యంగా బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 3 సీట్లు కట్టబెట్టారు.2023 అసెంబ్లీ ఎన్నిల్లో ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ ఎవరూ ఊహించని పరిస్థితి ఎదుర్కొంటోంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం నేతలు పోటీ పడ్డారు. ఇప్పుడు టికెట్‌ పిలిచి ఇచ్చినా పోటీకి నేతలు ససేమిరా అంటున్నారు. వరంగల్‌ ఎంపీ టికెట కడియం కావ్యవకు ఇచ్చినా ఆమె పోటీకి నిరాకరించడమే ఇందుకు నిదర్శనం. దీంతో 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కారు – సారూ.. పదహారు నినాదంతో హడావుడి చేసిన బీఆర్‌ఎస్‌ ఇప్పడు ఏ నినాదం లేకుండానే పోటీలో నిలిచే నాయకులు ఉంటే చాలు అనుకుంటోంది.అసెంబ్లీ ఎన్నికత తర్వాత పార్టీ ఓటమిపై సమీక్ష చేయకుండా గులాబీ నేతలు ఏకపక్షంగా తమ పార్టీ ఓటమికి కాంగ్రెస్‌ మోసపరీత హామీలే కారణం ఆని ఆరోపిస్తున్నారు. పార్టీ తరఫున పొరపాటు ఉందని అంగీకరించడం లేదు. ఈ క్రమంలో తన క్యాడర్‌ బలంగా ఉందని చెప్పేందుకు తెలంగాణ బలం, గళం, దళం బీఆర్‌ఎస్‌ అని కేటీఆర్‌ ప్రకటించారు. ఇదే నినాదంతో లోక్‌సభ ఎన్నికలు ఎదుర్కొంటామని ప్రకటించారు. కానీ, అనూహ్యంగా పార్టీ దళం.. అధికార కాంగ్రెస్‌లోకి వెళ్తుండడంతో ఆ నినాదం పక్కన పెట్టారు. బలం అనుకున్న క్యాడర్‌ మద్దతు తెలిపే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ పేరులో తెలంగాణను ఎత్తేసిన తెలంగాణ బలం, దళం, గళం ఎలా అవుతారన్న ప్రశ్నలు రావడమే అందుకు కారణం అని కొందరు పేర్కొంటున్నారు.ఎన్నికల నినాదం అవుతుంది అనుకున్న స్లోగన్‌ బూమరాంగ్‌ అవడంతో గులాబీ నేతలు దానిని పక్కన పెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏ నినాదం లేకుండానే పోటీకి సిద్ధమవుతున్నారు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల నినాదం ఉంది. కానీ, పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్‌ ఈసారి ఏ నినాదం లేకుండా ఎన్నికల బరిలో దిగుతోంది. దీంతో జాతీయ పార్టీలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినా, వేయకపోయినా ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఏదో ఒక పార్టీకి ఓటు వేయడం మేలు అన్న ఆలోచనను ప్రజల్లో కల్పిస్తున్నారు. ఇదే నినాదాన్ని ప్రజలు నమ్మితే బీఆర్‌ఎస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్