అయిల్ ట్యాంకర్ ను ఓవర్ టేక్ చేయబోయి…
మేడ్చల్
కేటిఎం బైక్ తో ఆయిల్ టాంకర్ ని ఓవర్ టేక్ చేయబోయి ఆయిల్ టాంకర్ ఢీకొని బీటెక్ విద్యార్థి సాయి గణేష్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి నందనవనం వద్ద సంఘటన జరిగింది. మేడిపల్లి నుండి ఘట్ కేసర్ వైపు సాయి గణేష్ కేటిఎం బైక్ పై వెళ్తుండగా, అదే వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ని సాయి గణేష్ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆయిల్ టాంకర్ ఢీకొనడంతో సాయి గణేష్ ఆయిల్ టాంకర్ క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
సాయి గణేష్ ఘట్ కేసర్ అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. బైక్ పై వెళ్తున్న సాయి గణేష్ అతివేగంగా ఉండటమే ప్రమాదానికి కారణం తెలుస్తుంది.
సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు, కేసు నమోదు చేసి సాయి గణేష్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
అయిల్ ట్యాంకర్ ను ఓవర్ టేక్ చేయబోయి…

- Advertisement -
- Advertisement -



