- Advertisement -
పెండ్లి చేసుకొని మోసం చేశాడని భర్త ఇంటి ముందు బాధిత మహిళ నిరసన చేపట్టిన సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని లక్ష్మి భవాని కాలనీలో జరిగింది. బాధితురాలు జంబూరి శైలజ తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం అన్నపూర్ణ కాలనీలో నివాసముంటున్న శైలజకి మందమర్రి లక్ష్మి భవానికాలనీకి చెందిన ఆడెపు సాయికృష్ణతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మా అమ్మ వాళ్ళ తరుపు బంధువంటూ సాయికృష్ణ వరుస కలిపాడు. అప్పటికే వివాహం అయిన శైలజ మొదటి భర్త గణేష్ విశ్వేశ్వర్ 2021లో కరోనా వచ్చి మరణించాడు. అనంతరం సాయికృష్ణతో ఉన్న పరిచయం ప్రేమగా మారి చెల్లి స్వాతి, మరిది శ్రీకాంత్ సమక్షంలో 2022 ఆగస్టు 23వ తేదీన తన ఇంట్లోనే వివాహం జరిగింది. సుమారు సంవత్సరం ఐదు నెలలుగా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. పెండ్లి విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి తనను తీసుకొని వెళ్లమని ఎన్నిసార్లు అడిగినా అమ్మ ఆరోగ్యం బాగాలేదని తర్వాత చెప్తాను అని దాటవేసేవాడు. ఇంటికి తీసుకెళ్ళాలని కోరితే ఎస్సీ మాదిగ కులం మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు..
- Advertisement -