*రుద్రoగి మండలం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు*
*కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రంగి మండల జడ్పిటిసి గట్ల మీనయ్య, ఇతర పార్టీల నాయకులు*.
*కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్*
రాజన్న సిరిసిల్ల జిల్లా వాయిస్ టుడే ప్రతినిధి ఏప్రిల్ 14: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల జడ్పిటిసి గట్ల మీనయ్య వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.10 సంవత్సరాల బిఆర్ఎస్ బిజెపి పాలనలో రాష్ట్రానికి దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు.. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు..