*ఏపీ లో రాయిపై మొదలైన చర్చా వేదికలు… ఎక్కడ విన్నా… రాయి మాటే.. ఏపీ రాజకీయాలు లో రాయి ఒక సంషేషన్ మలుపు గా మారనుందా..?*
*సీఎం జగన్ మీద రాయి దాడి..అది మరువక ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై రాయి దాడి..ఇంతలో టీడీపీ అధినేత చంద్రబాబు పై రాయి దాడి…ఈ రాయి గురించి ఎక్కడ చూసినా చర్చా వేదికలు మొదలయ్యా యి…ఏపీ లో రాజకీయం మొత్తం రాయి మీదే సాగుతోంది.*
ఎన్నికల సమయంలో తమకు సవాళ్లుగా మారిన అన్ని అంశాలకు పరిష్కారం లభించినట్లేనని వైసీపీ నేతలు ప్రకటనలు చేయడం ప్రారంభించారు.
అది తప్ప మరో ఇష్యూ లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న స్పందనపై భిన్నాభిప్రాయాలున్నాయి.
సీఎం భద్రత కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు సీఎం జగన్.
అయినా ఎన్నికల సమయంలో దాడి జరిగింది.
కానీ ఈ దాడిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎంగా జగన్ తనకు తన కుటుంబానికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునే ముందే సీఎంకు హై రేంజ్ సెక్యూరిటీ ఉంటుంది.
ఆయన రోడ్డు మీదకు రావాలంటే మొత్తం ఇంటలిజెన్స్ పోలీసులు ముందుగానే జనంలోకి కలిసిపోయి ఎవరైనా నిరసనలు చేస్తారేమో చూస్తారు. వారిని పట్టుకుంటారు.
రాళ్లేసేవాళ్లుంటే అలక్ష్యం చేయరు.తర్వాత రోప్ పార్టీ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సీఎం భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అయినా గులకరాయి పడింది.
వెంటనే చంద్రబాబుపై ఆరోపణలు ప్రారంభించడంతో రాజకీయం
కనీస విచారణ పోలీసులు చేయకుండానే జగన్ పై రాయి దూసుకు వస్తే.. దానికి చంద్రబాబే కారణం అని ఆరోపించి సానుభూతి రాజకీయాలు ప్రారంభించగానే
వైసీపీ రాజకీయంపై టీడీపీ కూడా వెంటనే కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు.
కోడికత్తి డ్రామా టూ అంటూ అనేక ఉదాహరణలు చెప్పడం ప్రారంభించారు.
సాధారణంగా చీకటి ప డేసరికి.. అందరికీ గుర్తు చేసి.. చీకటి పడిందని చెప్పి మరీ బస్సులోకి వెళ్లిపోతారు జగన్.
కానీ విజయవాడలో చీకటి పడినా బస్సు మీద నిలబడే వెళ్లారు.
ఆ సమయానికి సెక్యూరిటీ వాళ్లు అంతా కింద కూర్చున్నారు.
రాయి దూసుకొచ్చిన తర్వాతనే మళ్లీ తిరిగి వచ్చారు.
కొన్ని కెమెరాలు ఆ రాయి పడటాన్ని షూట్ చేశాయి.
వీటన్నింటినీ వెనుక స్క్రిప్ట్ ఉందని టీడీపీ నేతలంటున్నారు.
ఇలా దాడి జరుగుతుందని తెలిసినట్లుగా వెంటనే వైసీపీ సోషల్ మీడియా రాజకీయ, సింపతీ డ్రామాలు ప్రారంభించేసిందని.. జగన్మోహన్ రెడ్డి నటనా నైపుణ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదని ఇదంతా స్క్రిప్ట్ అని ఆరోపిస్తున్నారు…
ఎన్డీయే కూటమి
ఐదేళ్లలో చంద్రబాబు మీద బహిరంగంగా చంద్రబాబు మీద రాళ్ల దాడులు చేశారు. మార్కాపురంలో చంద్రబాబుపై వేసిన రాళ్లు తగిలి ఓ వృద్ధుడు చనిపోయాడని అప్పుడు వైసీపీ నేతలు అన్న మాటల్ని వైరల్ చేశారు.
వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై పడిన రాయి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.
ఇదే క్రమంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును విశాఖ నగరంలోని గాజువాకలో ఆదివారం రాత్రి రాయితో కొట్టారు. అయితే ఆ రాయి గురి తప్పింది. కొట్టిన వ్యక్తి పక్కనే ఉన్న గోడదూకి పరారయ్యాడు. అందరూ చూస్తుండగానే పరారయినా ఆ యువకుడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు.
రాయి గురితప్పింది. లేకుంటే ఎక్కడ తగిలినా ప్రానానికి ప్రమాదం ఏర్పడేదని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.
తెనాలిలో జనసేన నేత పవన్‌కళ్యాణ్‌పై రాయి విసిరాడో వ్యక్తి. పవన్ సెక్యూరిటీ సిబ్బంది రాయిని పవన్‌పై పడకుండా పట్టుకున్నారు. ఆ వెంటనే రాయి విసిరిన యువకుడిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది. చితక బాదారు. దీంతో ఆ యువకుడికి ముక్కుల్లో నుంచి రక్తం కూడా వచ్చింది. మాట్లాడలేని స్థితిలో ఉన్న యువకుడిని పోలీసులు తీసుకెళ్ళారు. పోలీసులు వారి వెషన్ చెబుతున్నారు. మొత్తంగా రాళ్ల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. అసలు విషయాలు పక్కకుపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.
రాయి వేసిన వాళ్ల సమాచారం ఇస్తే రెండు లక్షలు ఇస్తామంటున్న పోలీసులు
సీఎం జగన్ వస్తున్న సమయలో జనాల్ని మీడియాతో పాటు ఇతర మీడియాలు కూడా చాలా వరకూ వీడియోలు తీశాయి.
రాయి వచ్చిన వైపు నుంచి ఇరవై ముప్ఫై మంది ఉంటారు. ఆ కొద్ది మందిని అందర్నీ అదుపులోకి తీసుకుని ఉంటే ఎవరు రాయి వేశారో.. ఎందుకు రాయి వేశారో తేలిపోయేదని.. కానీ ఆ దిశగా ఆలోచించలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
రాయి విసిరిన వాళ్ల కోసం అసలు చూడలేదు. ఇప్పుడు రాయి చేతితోనే విసిరాడని.. ఎవరో తెలుసుకోవాల్సి ఉందని సీపీ చెబుతున్నారు. అని ఎన్డీయే కూటమి ఆరోపించారు.
అయితే పోలీసుల వద్ద పూర్తి సమాచారం లేకపోవడంతో.. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి రెండు లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు.