*ఇన్సూరెన్స్ డబ్బు కోసం…క్రైం* *సినిమా ను మించి నిజజీవితంలో* *డైరెక్టర్ గా* *మారిన …క్రైం విలన్…*
*ఏది ఏమైనా పోలీసుల ఎంట్రీ తో క్రైం సీన్లు కి తెరపడాల్సిందే మరీ… ఏంటో ఆస్టోరీ చదివి తెలుసుకుందాం* …
ఒక మహిళ అనుమానస్పదంగా మరణింంచింది.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు ప్రచారం చేశారు.
అంతా నమ్మేశారు.
ఎందుకంటే అంతలా వేసిన స్కెచ్ అది.
సినీ స్టైల్లో వేసిన స్కెచ్ చివరకు హత్యగా తేలింది.
ఇంతకీ ఆ హత్య వెనుక అసలు స్కెచ్ ఏంటి..?
ప్రియుడు ఆ ప్లాన్ ఎందుకు చేసాడు..?
విశాఖ….
ఆ రోజు ఏప్రిల్ 8.. ఈశ్వరి అనే వివాహిత విశాఖ ద్వారకా నగర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందింది.
మృతాదేహాన్ని ఇద్దరు ఆటోలో తీసుకెళ్లి ఇంటికి అప్పగించారు.
ఏమైందని ప్రశ్నిస్తే ?రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు నమ్మించారు.
దీంతో అంతా అదే నిజమని అనుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు
పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి మర్డర్ ప్లాన్ బయటపడింది.
సినీ స్టైల్లో వేసిన స్కెచ్ చూసి పోలీసులే అవాక్కయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈశ్వరి అనే వివాహిత బతికుతెరువు కోసం కుటుంబంతో విశాఖ వచ్చింది.
ఆమెకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న షాహిద్ అలీతో పరిచయం ఏర్పడింది. తనకున్న పరిచయంతో షాహిద్ అలీ.. ఈశ్వరి పేరుతో ఇన్సూరెన్స్ చేయించాడు.
ఇన్సూరెన్స్ మొత్తం తానే చెల్లిస్తానని.. మెచ్యూరిటీ పూర్తవ్వగానే సగం సగం చేసుకుందామని ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
*పోలీసుల ఇన్విస్టిగేషన్ లో నిజాలు ….*
పాలసీ మెచ్యూరిటీ డేట్ సమీపిస్తోంది. దాదాపు పదిహేను లక్షల వరకు ఆ సొమ్ము వస్తుంది. ఇటీవల ఆ పాలసీ విషయంలో ఈశ్వరి, షాహిద్ అలీ మధ్య వివాదం మొదలైంది. దీంతో కక్ష గట్టిన షాహిద్ అలీ.. ఆమెను మట్టుబెట్టి ఆ పాలసీ సొమ్ము తానే కాజేయాలని స్కెచ్ వేశాడు. ప్లాన్‌లో భాగంగా ఆమెను ఇన్సూరెన్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఏయూ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు షాహిద్ అలీ. ప్రమాదంలో మరణిస్తే ఎక్కువ బీమా వస్తుందనే ఆశతో.. ఈశ్వరి మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. దాన్ని అందరూ నమ్మేలా ప్రయత్నం చేశాడు. వాహనంపై వెళ్తుండగా ఆమె పడిందని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ రసీదులు రాయించి ఆపై గాజువాక ఆంటోని నగర్‌లో ఉన్న జితేంద్ర సహకారంతో ఆటోలో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో ఈ డెత్ వెనుక ఉన్న మర్డర్ స్కెచ్.. మర్డర్ వెనుక ఉన్న అసలు ప్లాన్ వెలుగులోకి వచ్చింది. ఆధారాలను సేకరించిన పోలీసులు.. షాహిద్ అలీ, అతనికి సహకరించిన మరొకడిని కూడా అరెస్ట్ చేసి కటకటాలా వెనక్కినెట్టారు.