దేశంలో ఈరోజు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ప్రజల్లో అణువణువునా శ్రీరాముడు కొలువైవున్నాడని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా శ్రీ రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ.. సోషల్ సైట్ ఎక్స్‌లో.. ‘దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీ రాముని జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సమయంలో నా హృదయం భావోద్వేగంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ సంవత్సరం లక్షలాది దేశప్రజల ఆకాంక్ష నెరవేరడాన్ని చూశాను. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు అయోధ్యలో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునే భాగ్యం మనకు లభించింది’ అని పేర్కొన్నారు.