గురురాజాలో ఘనంగాఎస్. ఎస్. సి విద్యార్థులకు అభినందన సత్కారం
నంద్యాల
నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ నందుగల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఎస్ఎస్సి 2023..24 విద్యా సంవత్సరంలో అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించినట్లుగా స్కూల్ డైరెక్టర్ పి .షేక్షావలి రెడ్డి తెలిపారు. ఈ బహుమతి ప్రధానోత్సవానికి గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పి దస్త గిరిరెడ్డి విచ్చేసి.. ఎస్ఎస్సి 2023..24 ఫలితాలలో జి. జోషిత 594, ఎం. హర్షిత 594 ,డి .పల్లవి 593, ఎం. రష్మీ 593 , కే. నాగ కుమారి 592, ఎం. సుశాంత్ 590 ఇలా వరుసగా 575 నుంచి 594 మార్కులను సాధించిన 31 మంది విద్యార్థులకు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ 500 నుంచి 594 మార్కులు 214 మంది విద్యార్థులు, సాధించారు. ప్రతి ఇద్దరిలో ఒకరు 500 మార్కులు సాధించారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు జ్ఞాపికను అందజేసి వారి విజయాలను ప్రశంసించారు. ఇదే రీతిలో భవిష్యత్తులో చక్కని ప్రతిభను కనబరుస్తూ ,అద్భుతమైన విజయాలను సాధిస్తూ ,తల్లిదండ్రుల ఆశయాలను, మీ కలలను సాకారం చేసుకోవాలని విద్యార్థులకు సందేశాన్ని అందిస్తూ వారి విజయాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు