ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిన చింతమనేని
దెందులూరు
నిన్న శ్రీకాకుళంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బి-ఫామ్ అందుకున్న దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, గురువారం ఉదయం ఆధ్యాత్మిక భావనతో పలు ఆలయాలను దర్శించారు.
పెదవేగి మండలంలోని రాట్నాలకుంట ఆలయంలో శ్రీ రాట్నాలమ్మ అమ్మవారిని, ద్వారకా తిరుమల దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారితో పాటు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న చింతమనేని ప్రభాకర్ – బి ఫామ్ నీ ఆలయంలో అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు చింతమనేనికి విజయాన్ని ఆశీర్వదిస్తూ వేద ఆశీర్వచనం అందించారు. మరికాసేపట్లో టిడిపి తరపున అభ్యర్ధిగా తన బి – ఫామ్ నీ దెందులూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఎన్నికల అధికారికి అందచేయించి – నియోజకవర్గంలో జరిగే విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొననున్నారు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిన చింతమనేని
- Advertisement -
- Advertisement -