పాతబస్తీలో వినూత్న ప్రచారం
హైదరాబాద్, ఏప్రిల్ 26,
ఆమె దెబ్బకు పాతబస్తీలో పూనకాలు లోడింగ్ అన్నట్లు మారిపోయింది రాజకీయం. మొన్న మతపరమైన కట్టడంపై బాణం ఎక్కుపెట్టారని ఆరోపణలు వచ్చాయి. తర్వాత పతంగి అంతం చూస్తానంటూ పంతం పట్టారు. గాలి పటం ఎగరేస్తున్నట్టు యాక్షన్ చేసి, దాన్ని కట్ చేసినట్లు చూపించి.. బీజేపీ కేడర్‌లో కాక రేపారు. మాటల కంటే చేతలతోనే మంటలు రేపుతున్నారు. తన హావభావాలతో.. ఓల్డ్ సిటీలో కైట్ ఫైట్‌ని పీక్స్‌కి తీసుకువెళ్లారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం మామూలుగా లేదు. అందులోనూ రాజధాని నగరం హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ఎన్నికల ప్రచారం కాకరేపుతోంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థులుగా ఇంతవరకు ఎంతమంది పోటీ చేసినా, ప్రచారం చేసినా.. ఆమెకు వచ్చిన క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అంటున్నారు పబ్లిక్. ఆమె నన్ అదర్ దేన్ మాధవీ లత. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినప్పుడు జనానికి పెద్దగా పరిచయం లేని పేరు. రాజకీయాలకు పూర్తిగా కొత్త ముఖం. అయితే ఇప్పుడు ఆమె పేరు తెలియనివాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే లేరు. ఇక జాతీయ స్థాయిలో కూడా మాధవీలత పేరు మార్మోగిపోతోంది.హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మాధవీ లత ఏం చేయగలరు? అది మజ్లిస్ అడ్డా. ఒవైసీ గడ్డ అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు మాధవీలత ప్రచారం పాతబస్తీలో బీజేపీ కేడర్‌కు ఊపు తెస్తోంది. మజ్లిస్ ఎన్నికల గుర్తు పతంగి. దాన్ని చేతులతో ఎగరేసి కట్ చేసినట్లు చూపిస్తున్నారు మాధవీలత. నాకు మాటలు అక్కర్లేదు. చేతలు చాలు అంటూ మాధవీలత చేస్తున్న పొలిటికల్ యాక్షన్‌కు రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా వస్తోంది. అయినా తగ్గేదే లా అన్నట్లు మాధవీలత దూసుకుపోతున్నారు. పాతబస్తీలో సరికొత్త రాజకీయ రంగు, రుచి, వాసన జనానికి చూపిస్తున్నారు. ప్రచారంతో పూనకాలు తెప్పిస్తున్న మాధవీలతపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక ఒవైసీ బ్రదర్స్ కూడా ఆమె మీద గరం గరం అవుతున్నారు. ఇదే తరుణంలో ఆయన కూడా కైట్ ను మరింత జోష్ గా ఆకాశంలో ఎగురవేస్తున్నట్లు చేతులతో హావభావాలను పలికించారు. ఇలా ఇరువురి మధ్య మాటల తూటాలు కాస్త సైగలతో దూసుకెళ్లిపోతోంది. దీనిని ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.
పాతబస్తీలో వినూత్న ప్రచారం
- Advertisement -
- Advertisement -