. కోదాడ ,ఏప్రిల్ 26 (వాయిస్ టుడే ప్రతినిధి). సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రామాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన బాల గుర్రప్ప స్వామి, గంగమ్మ ,చౌడమ్మ, శ్రీకృష్ణ ,లక్ష్మీ ,సరస్వతి , నందీశ్వరుడు, పోతురాజు ల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శుక్రవారం వేద పండితుల, పూజా కార్యక్రమాలతో ముగిసింది. , తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అర్చకుల, శిష్య బృందం,వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితుల సమక్షంలో ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. స్థిర ప్రతిష్ట మహోత్సవం తదుపరి మహా అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. . ఈ కార్యక్రమానికి ,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేసిన వారినీ పేరుపేరునా కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరము తెలంగాణ సాయుధ పోరాట యోధులు కుక్క డప్పు. రంగయ్య వారసులైన వెంకటేశ్వరరావు(బాబు)ను కమిటీ సభ్యులు , పోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు, మారిశెట్టి నరసింహారావు, రాజుల గురుస్వామి, మరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు.