తాను నిఖార్సైన కాపునని పవన్ ఫ్యామిలీ చరిత్ర ఏంటో చెప్పాలి..?
వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం డిమాండ్
అమరావతి మే 8
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరెత్తినా.. ఆయనకు ఎవరైనా అనుకూలంగా మాట్లాడినా ముద్రగడకు అస్సలంటే అస్సలు పడట్లేదు. ఎవరో ఎందుకు కన్న కూతురు క్రాంతి భారతీ పవన్‌కు మద్దతివ్వడం.. సేనానికే ఓటేయాలని పిలుపునివ్వడంతో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇద్దరూ ఎదురుపడితే ఒకరిపై ఒకరు దాడి చేసుకునేలానే మాట్లాడుకున్నారు. ఇక పవన్‌ను కలిసిన క్రాంతి.. సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం.. సేనానితో కలిసి వేదిక కూడా పంచుకోగా.. రానున్న ఎన్నికల్లో భారతికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందనుకుంటే అబ్బే అస్సలు అయ్యేలా కనిపించట్లేదు. ఇక పవన్‌ను.. మెగా ఫ్యామిలీ ప్రస్తావన అస్తమాను తెస్తున్న వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం మరోసారి మీడియా ముందుకు రచ్చ రచ్చే చేశారు.మీడియా ముందుకు వచ్చీ రాగానే.. తాను నిఖార్సైన కాపునని పవన్ ఫ్యామిలీ చరిత్ర ఏంటో చెప్పాలి..? అని డిమాండ్ చేశారు. ‘అసలు సిసలైన కాపులు ఎవరు..? కల్తీ కాపులు ఎవరు..? అనేది ప్రజలకు తెలియాలి. మెగా ఫ్యామిలీ అమ్మాయిని ప్రేమించిన నాయి బ్రాహ్మణ కులానికి చెందిన నటుడికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసి అతను కృంగి, కృశించి పోయేలా చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆ విషయాన్ని బయటికి చెప్పాలి. దృష్టుల వల్ల నా కూతురు నేను దూరమయ్యాం.. మరో జన్మలో మళ్ళీ కలుద్దాం’ అని మీడియా ముఖంగా క్రాంతి భారతీకి ముద్రగడ చెప్పుకొచ్చారు. మళ్లీ మళ్లీ కన్న కూతురు, మెగా ఫ్యామిలీపై ఎంతలా ముద్రగడ విషం కక్కుతున్నారో చూశారుగా..! ఈ కామెంట్స్‌పై ఇంతవరకూ మెగా ఫ్యామిలీకానీ.. పవన్ కల్యాణ్ స్పందించిన దాఖలాల్లేవ్. ఈసారైనా జనసేనాని స్పందించి కౌంటర్ ఇస్తారేమో అని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.